వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డికి హైకోర్టు ఆదేశాల మేరకు రూ. 17 కోట్ల జరిమానా విధించారు. విశాఖ బీచ్ లో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు జరిపించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రోజుకు 1.2 లక్షల చొప్పున 1455 రోజుల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణాలలో తవ్విన ప్రాంతాలను పునరుద్ధరించకపోతే జరిమానా మరింత రెట్టింపు కానుంది. పర్యావరణ నిబంధనలు విస్మరించడంతో కేసులు కూడా నమోదు అయ్యాయి.