మాజీ ఎంపీ రాయపాటి, ట్రాన్స్‌ట్రాయ్ డైరెక్టర్ ఇంట్లో ఈడీ సోదాలు

-

గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కు ఊహించని షాక్ తగిలింది. గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, ట్రాన్స్ ట్రాయ్ డైరెక్టర్ నివాసం, మరియు కార్యాలయాలలో ఇవాళ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారని ఆరోపణలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అంతేకాదు ట్రాన్స్ ట్రాయ్ నుంచి సింగపూర్ లిమిటెడ్ కు నిధులు వెళ్లినట్లు అధికారులు గుర్తించారట. ఇక అటు ఇవాళ ఉదయం హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, మణికొండ పంజాగుట్టలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకంగా 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. మాలినని సాంబశివరావు తోపాటు పలువురు ఇండ్లలో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version