IND vs WI : మూడో వన్డే నుంచి విరాట్ కోహ్లీ ఔట్ ?

-

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జెట్ల మధ్య ఇవాళ మూడో వన్డే జరగనుంది. ఈ మూడో వన్డే మ్యాచ్ లో గెలిచిన జట్టుకు సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది. మూడు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా గెలువగా… రెండో వన్డే మ్యాచ్ లో మాత్రం వెస్టిండీస్ విజయం సాధించింది.

ఇక చివరిదైనా మూడే వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా భావిస్తుంది. అయితే ఇవాళ మూడో వన్డే మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. మూడో వన్డే కోసం టీమిండియా సభ్యులు బార్బర్ డోస్ నుంచి ట్రేనిడాడు చేరుకోగా అందులో విరాట్ కోహ్లీ మాత్రం లేడు. దీంతో అతను మూడో మ్యాచ్ లో కూడా ఆడకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version