అప్జల్ గంజ్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్..!

-

అప్జల్ గంజ్  కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతనెలలో అప్జల్ గంజ్ లో కాల్పులకు పాల్పడ్డ ఘటనలో పోలీసులు కీలక నిందితులను గుర్తించారు. నిందితులు బీహార్  కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్ గా నిర్ధారించారు. కాగా గత డిసెంబర్ లో కాల్పుల ఘటన జరిగిన అనంతరం 4 రాష్ట్రాల పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అప్జల్ గంజ్ కాల్పులు జరిపిన తరువాత నిందితులు ఏపీకి పారిపోయి అక్కడి నుంచి చెన్నైకి, బీదర్ కు పారిపోయినట్టు కనుక్కున్నారు.

ఈ గ్యాంగ్ కోసం ఏడాది కాలంగా యూపీ పోలీసులు కూడా గాలిస్తున్న విషయం తెలుసుకొని, సంయుక్త ఆపరేషన్స్ చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు మీడియాకు తెలియజేశారు. ప్రాథమికంగా పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం ఈ కేసులోని ఇద్దరి నిందితులపై గతంలో కూడా బీహార్, యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరు రోజుల తరబడి హై-వేల పై తిరుగుతూ ఏటీఎం కేంద్రాలతో పాటు రాత్రి సమయంలో హైవేలపై కుటుంబాలతో వెళ్ళే వారితో పాటు ఇతరులను టార్గెట్ చేస్తారని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news