విశాఖ సాగరతీరంలో అరుదైన దృశ్యం.. నీలి కాంతులతో ఉప్పొంగుతున్న అలలు

-

విశాఖ సాగర తీరంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. భీమిలి బీచ్‌ పరిధిలో రాత్రి వేళల్లో కనిపిస్తున్న ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి నగర యువత క్యూ కడుతున్నారు. గత కొన్ని రోజులుగా కైలాసగిరి నుంచి భీమిలి వరకు సాగర తీరంలో అక్కడక్కడా కనిపించిన నీలి అలల కాంతులను కొందరు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది.

ఈ నీలికాంతుల అలలను ‘బయోల్యూమినిసెన్స్‌’ తరంగాలు అంటారని, ఇలాంటివి కొచ్చిన్‌ తీర ప్రాంతంలో జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయని, తూర్పుతీరంలో ఇదే మొదటిసారి అని ఓషనోగ్రఫీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి సాధారణంగా రెండు వారాలపాటు కనిపించే అవకాశం ఉంటుందన్నారు.

సముద్రంలో ఆల్గే (శైవలాలు) ఎక్కువగా పెరగడం వల్ల బయోల్యూమినిసెన్స్‌ వస్తాయని సముద్ర శాస్త్ర అధ్యాయన పరిశోధకులు చెబుతున్నారు. ఆల్గేలో జరిగే ఒక రసాయన చర్య వల్ల నీలి రంగు వస్తుందన్నారు.  ఇవి ఎక్కువగా వృద్ధి చెందడం వల్ల చేపల గిల్స్‌ (గాలి పీల్చుకునే) రంధ్రాలు మూసుకుపోయి చేపలు మృతి చెందడానికి ఆస్కారం ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version