విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని బీజేపీ సంచలన ప్రకటన చేసింది. విజయవాడ బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం లో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో పాల్గొన్న ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్ధనాధ్ సింగ్ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కేంద్ర సంక్షేమ పధకాలు అమలు దాదాపు జరగలేదు…అమరావతి ఐదు సంవత్సరాలలో రాజధాని కాలేదన్నారు. రాబోయే ఐదేళ్ళలో అమరావతి రాజధాని అవుతుంది.
పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుందని వెల్లడించారు సిద్దార్ధనాధ్ సింగ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు..విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడులు ఆగవని తేల్చి చెప్పారు సిద్దార్ధనాధ్ సింగ్. పోలవరం ప్రాజెక్ట్ పునాదులలో లోపాలు జరిగాయి…పోలవరం డిజైన్ మార్పులు చేసారని ఆగ్రహించారు. అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్ధుల విషయంలో ఎలాంటి మార్పులు లేవు… ఉగాది భారతదేశానికి, తెలుగువారికి చాలా ముఖ్యమైన రోజు అన్నారు. ఉగాది పండుగ ఏపిలో జరుపుకోవడం అద్భుతమని.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న చోట సంక్షేమం అమలు చేయడం సాధ్యపడిందని గురు చేశారు సిద్దార్ధనాధ్ సింగ్.