ఇవాళ సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. పల్నాడు జిల్లాలో సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. అయితే…. నేడు ఉగాది పండుగ సందర్భంగా, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. శావల్యాపురం మండలం గంటా వారి పాలెం లో ప్రత్యేక టెంట్ హౌస్ లో బస చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు సీఎం జగన్. భద్రతా కారణాలు, పరిమిత స్థల కారణాల రీత్యా, ముఖ్య నాయకులకు మాత్రమే పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకే ఇవాళ సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు.