కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్..లిస్టులు బడా నేతలు !

-

HYDRA has given a report to the Revanth Reddy government : హైడ్రా కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇవ్వడం జరిగింది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్రెడ్డి కట్టడాల కూల్చివేత చేసినట్లు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది.

HYDRA has given a report to the Revanth Reddy government on the demolition of illegal buildings in Hyderabad

చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేసినట్లు రిపోర్ట్ లో వెల్లడించింది హైడ్రా. లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్ పేట్ లో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు హైడ్రా రిపోర్ట్ స్పస్టం చేసింది.

  • బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేత
  • చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసిన హైడ్రా
  • నందగిరి హిల్స్లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేత
  • నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు.
    రాజేంద్రనగర్ చెరువులు కబ్జాలు కూల్చివేత
  • ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మిస్తున్న భవనం కూల్చివేత
  • ఎంఐఎం ఎం ఎల్ సి మిర్జా బేగ్ నిర్మించిన రెండంతస్తుల భవనం కూల్చివేత.
  • చందానగర్ ఏర్ల చెరువులో కబ్జాలు కూల్చివేత
  • ప్రగతి నగర్ ఎర్రగుంట లో నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేత
  • బోడుప్పల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలు కూల్చివేత.
  • గండిపేట చెరువులో నిర్మించిన ఫామోజులు కూల్చివేత,
  • మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు సంబంధించిన ఒరో స్పోర్ట్ కూల్చివేత.
  • టీటీడీ మాజీ సభ్యుడు కావేరి సీడ్స్ యజమాని ఫామ్ హౌస్ కూల్చివేత.
  • బిజెపి మంతిని కీలక నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చివేత
  • ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ కూల్చివేత
  • మాదాపూర్ లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version