ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇవాళ (శనివారం) సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో భారత్ , పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించి కేంద్రానికి ఏపీ సంఘీభావం పై గవర్నర్తో ఏపీ
సీఎం చర్చలు జరపనున్నారు.
ఈ క్రమంలో తిరుపతి విశాఖ లాంటి సున్నిత ప్రాంతాల్లో రక్షణ చర్యలపై సీఎం చంద్రబాబు
గవర్నర్ కి వివరించనున్నారు. హైదరాబాద్ లో ఉన్న సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అమరావతి కి చేరుకోనున్నారు. దేశ వ్యాప్తంగా పాక్ దాడులు చేస్తుందని అలెర్ట్ గా ఉంది భారత ప్రభుత్వం. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.