భారత్ -పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఒక ఒప్పందంతో ముందుకు వచ్చారు. భారత్ చేస్తున్న దాడులు ఎదుర్కొలేక తీవ్రంగా నష్టపోతున్న పాకిస్థాన్ చివరి కాళ్ల బేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత్ దాడి చేయకపోతే, మేము కూడా దాడి చేయం అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్రిక్తతలు ఆపేందుకు భారత్ దాడిని ఆపేస్తే తాము కూడా ఆపేస్తామంటూ ఆయన పేర్కొన్నారు. అయితే కేవలం దాడి ఆపితే సరిపోదు.. ఉగ్రవాదాన్ని ఆపాలి, ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపాలి, భారత్‌పై కుట్రలు పన్నడం ఆపాలి అని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర ప్రతిస్పందనలు భారతీయుల నుంచి వస్తున్నాయి.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. తదుపరి స్థాయికి కూడా మేం సిద్ధంగా ఉన్నామని అన్నారు. “ప్రపంచం మధ్యవర్తిత్వం వహిస్తే, మేం దానికి కూడా సిద్ధంగా ఉన్నాం, కానీ మేం మా రక్షణను తగ్గించం అని అన్నారు. అయితే రెండు అణ్వాయుధ శక్తుల మధ్య యుద్ధం మొత్తం ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయం. కాగా, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇదే విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, ఆర్మీ చీఫ్ తో మాట్లాడారు.