మిస్ వరల్డ్ కాంపిటీషన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈమేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఎమ్మెల్సీ కవిత దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతీ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. రాజకీయంలో ఉన్నాం కదా అని ఏదో ఒకటి మాట్లాడాలి అన్న ఆలోచన ఆమోదమన్నారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ లను పోస్ట్ ఫోన్ చేయడం లేదా రద్దు చేయడం లాంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వానికి చేసే అధికారం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక ఫెలిసేటేటర్ మాత్రమేనని.. తెలంగాణ రాష్ట్రం నేడు చాలా సేపెస్ట్ ప్లేస్ అని తెలంగాణలో పెట్టుబడులు పెట్టవచ్చని తెలంగాణలో ఇంత పెద్ద ఈవెంట్లు ప్రపంచ వ్యాప్తంగా చూసే ఈవెంట్లను చేయవచ్చని తెలిపారు. ఒక 4, 5 నెలల క్రితం ఈ ప్లేస్ తెలంగాణను సెలెక్ట్ చేశారని తెలిపారు. తెలంగాణ మీద నమ్మకంతో ఇక్కడ ఈవెంట్ పెట్టుకున్నారని అన్నారు.