YCP: బోరుగ‌డ్డ అనిల్‌కు ఈనెల 29 వరకు రిమాండ్

-

YCP: బోరుగ‌డ్డ అనిల్‌ గురువారం రోజున అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అనిల్‌ ను అరెస్ట్‌ చేసిన తర్వాత గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్ నుంచి సీసీఎస్‌కు త‌ర‌లించారు. గ‌త ప్ర‌భుత్వంలో టీడీపీ నాయకులు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కుటుంబంపై అస‌భ్య‌క‌ర‌ వ్యాఖ్య‌లు చేశాడు. అనిల్ అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న నేప‌థ్యంలో విచారించారు సీసీఎస్ పోలీసులు.

Borugadda Anil remanded till 29th of this month

గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ తరుణంలోనే… బోరుగ‌డ్డ అనిల్‌కు ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది కోర్టు. వాస్తావానికి 2021లో కర్లపూడి బాబుప్రకాష్ అనే వ్య‌క్తిని రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో అనిల్‌ అరెస్ట్‌ అయ్యారట. రిమాండ్ నేప‌థ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అనిల్‌ను త‌ర‌లించ‌నున్నారు పోలీసులు. అనిల్‌పై దాదాపు 20 వరకు పెండింగ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version