దళారులు లాభ పడుతున్నారు.. మత్స్యకారులు నష్టపోతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా సీఎం చంద్రబాబు శ్రీకాకులం జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్రతీరంలో మత్య్సకారుల వద్దకు వెల్లి వారి జీవన విధానాన్ని పరిశీలించారు. మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మత్స్య కారులను ఆదుకుంటామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామని.. ఎన్ని కష్టాలున్నా మీ పరిస్థితి మారుస్తామని తెలిపారు.
గత ప్రబుత్వం రూ.10లక్షల కోట్లు అప్పు చేసిందని తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి కాబోతుందని తెలిపారు. పేదవారి కోసం ఎన్నో కార్యక్రమాలను తీసుకొస్తున్నాం. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు రావాలంటే ప్రత్యేకంగా ఏమి చేయాలో ప్రణాళిక అమలు చేసి.. ప్రణాళిక పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని తెలిపారు. ఆర్థికంగా ముందుకు పోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టూరిస్టులు అంతా రావాలంటే మంచి ప్రదేశాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవు అని తెలిపారు.