తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్ కోసం కాంగ్రెస్ నేతలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రేపు బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రేపు ఏమి మాట్లాడతారోనని కాంగ్రెస్ నేతలే ఎక్కువగా చర్చించుకున్నారట. ఆయన సభలో ఏం చెబుతారోననే టెన్షన్ వారిలో ఉంది. వాళ్లు ఏం చేసినా రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం కష్టపడి పని చేశామని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్, కేసీఆర్ వైపే చూస్తున్నారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని.. ఆత్మహత్య తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో పాలు, నీళ్ల తేడా ప్రజలకు తెలిసిందన్నారు.