తెలంగాణకు ఎంతో ఘన చరిత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని HICC నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సమ్మిట్ లో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజంలోని ప్రతీ ఒక్కరి ఆకాంక్షలు నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే 60వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. అలాగే రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రూ.20,617 కోట్లతో రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రైతులు మద్దతు ధర కోసం గతంలో ఆందోళన చేసేవారు. కానీ ప్రస్తుతం అలాంటి ఆందోళనలు లేవు అని తెలిపారు. 5 లక్షల యువతకు రాజీవ్ యువ వికాసం అమలు చేస్తున్నామని తెలిపారు. 24 గంటలు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.