పాలమూరు రేవంత్ రెడ్డి అడ్డా కాదు.. కేసీఆర్ అడ్డా – ఎమ్మెల్సీ నవీన్ కుమార్

-

పాలమూరు రేవంత్ రెడ్డి అడ్డా కాదు.. కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ కుమార్… ఎమ్మెల్సీ మీడియా పాయింట్ లో మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. నా విజయానికి కారకులైన mptc, జడ్పీటీసీ లకు ధన్యవాదాలు చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నాకు విజయం వరించిందని గుర్తు చేశారు.

brs mlc naveen kumar on cm revanth

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహాబూబ్ నగర్ నుంచి నన్ను గెలిపించారని వివరించారు. దీనితో పాలమూరు రేవంత్ రెడ్డి అడ్డా కాదు కేసీఆర్ అడ్డా అని అర్థం అవుతుందని తెలిపారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్. ఆరు గ్యారెంటీ ల అమలు సరిగ్గా లేదు అని కాంగ్రెస్ ను గెలిపించకుండా నన్ను గెలిపించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news