బీటెక్ రవికి 14 రోజులు రిమాండ్.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు

-

మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టిడిపి ఇన్చార్జి బీటెక్ రవి అరెస్టు అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కడప మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరచగా… న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను కడప జైలుకు తరలించారు. గతంలో లోకేష్ కడప పర్యటన సమయంలో ఏయిర్ పోర్టు వద్ద జరిగిన ఘర్షణ కేసులో రవిని అరెస్టు చేసినట్టు డిఎస్పి షరీఫ్ తెలిపారు. ఆరోజు తమ ఏఎస్ఐకి గాయాలు అయ్యాయని చెప్పారు.

BTech Ravi remanded for 14 days

ఇది ఇలా ఉండగా.. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ కు స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్ రవి కడప విమానాశ్రయం ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయనకు వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దాదాపు పది నెలల తర్వాత వల్లూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ తరుణంలో బీటెక్‌ రవి అరెస్ట్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version