పుస్తకప్రియులకు గుడ్ న్యూస్. పుస్తకప్రియులు ఎంతగానో ఎదురుచూసే విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ఈ ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 7 వరకు నిర్వహించనున్నట్లు విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ అధ్యక్షుడు టి.మనోహర్ నాయుడు వెల్లడించారు.
మంగళవారం విజయవాడలో సిసిఎల్ఏ అదనపు కమిషనర్, ఏపీ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ ఏఎండి ఇంతియాజ్ లతో కలిసి ఉత్సవాల బ్రోచర్లను ఆవిష్కరించారు. మనోహర్ నాయుడు మాట్లాడుతూ….’ఏటా జనవరి 1 నుంచి 11 వరకు జరిగే పుస్తక మహోత్సవాన్ని ఈ ఏడాది డిసెంబర్ 28 నుంచి ప్రారంభిస్తున్న విజయవాడ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఈ ఉత్సవం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రచరణ కర్తలు, పుస్తక పంపిణీదారులు పాల్గొంటారు. పుస్తకావిష్కరణలు, సాహిత్య కార్యక్రమాలు, పుస్తకప్రియుల పాదయాత్ర మొదలైనవి ఉంటాయి.