కొడాలి నాని ఓ పిచ్చికుక్క.. రేబీస్ ఇంజెక్షన్లు వేయాలి – బుద్ధా వెంకన్న

-

కొడాలి నాని ఓ పిచ్చికుక్క.. రేబీస్ ఇంజెక్షన్లు వేయాలంటూ టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్ధా వెంకన్న ఫైర్‌ అయ్యారు. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క…కొడాలి నానికి రేబీస్ ఇంజెక్షన్లు చేయించాలి అని చాలా సార్లు చెప్పానన్నారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారని..ఊరంతా తిరుగుతానని అంటున్నాడు కొడాలి నాని.. ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నానని చురకలు అంటించారు బుద్ధా వెంకన్న.

budda venkanna warns kodali nani

నా సొంత డబ్బులతో 5 రేబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడ పార్శిల్ చేస్తున్నానని…జనాల సెఫ్టీ కోసం ఇంజెక్షన్లు కొన్నానని పేర్కొన్నారు. చంద్రబాబు ను తిడితే…కొడాలి నాని రెండు కాళ్ళూ విరక్కొట్టి పోయ్యిలో పెడతానని హెచ్చరించారు కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయించాలని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి అంటూ స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు బుద్ధా వెంకన్న. అటు కేశినేని నాని ఆఫీసు బోర్డులపై బుద్ధ వెంకన్న కామెంట్లు చేశారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దీక్షలు పూనింది నేను…కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ నావి, చంద్రబాబు వి అన్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్ మేమే పెట్టామని బోర్డులు పెట్టుకుంటే… అదంతా అభూతకల్పన అంటూ రెచ్చిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news