Chandrababu : అసైన్డ్ భూముల కేసు.. సీఐడీ పిటిషన్లపై విచారణ వాయిదా

-

Chandrababu : అసైన్డ్ భూముల కేసు.. సీఐడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. అసైన్డ్ భూముల కేసులో ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది. అమరావతిలో అసైన్డ్ భూముల సేకరణలో చంద్రబాబు, నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని గతంలో కేసు నమోదయింది.

దాన్ని కొట్టేయాలంటూ బాబు, నారాయణ వేసిన క్వాష్ పిటిషన్లపై ఇప్పటికే విచారణ ముగియగా…. ధర్మాసనం తీర్పును నేటికీ రిజర్వ్ చేసింది. మరోవైపు కేసు రీఓపెన్ చేయాలంటూ సిఐడి రెండు పిటిషన్లు దాఖలు చేసింది. వాటిపై విచారణను కోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది.

కాగా, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్ళనున్నారు. సిబిఎన్ క్వాష్ పిటిషన్ ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్ రేపు సుప్రీంలో విచారణ జరగనున్న నేపథ్యంలో లాయర్లతో ఆయన చర్చించనున్నారు. అమరావతి IRR కేసులో ఇటీవల లోకేష్ సిఐడి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అనంతరం చంద్రబాబుతో ములఖత్ అయ్యి…. హైదరాబాద్ కి వెళ్లారు. అక్కడే ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version