మాజీ ఎంపీ హర్ష కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై కేసు నమోదు ఐంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో తప్పుడు ఆరోపణలు చేశాడని కేసు నమోదు అయింది. బీఎన్ఎస్ సెక్షన్లు 196, 197 ప్రకారం మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది . తాజాగా ఈ అంశంపై స్పందించిన హర్షకుమార్.. తనకు ఎలాంటి సమాచారం దీనిపై లేదన్నారు.

ఇది ఇలా ఉండగా ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో క్రైస్తవ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న తరుణంలో పోలీసులు మరో కీలక ఆధారాన్ని బయటపెట్టారు. మద్యం సేవించిన ప్రవీణ్..తన మరణానికి ముందు పలుమార్లు బైకు మీద నుంచి కింద పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.