ఏపీలో నేటి నుంచి కులగణన.. ఇంటింటికీ వెళ్లి సర్వే

-

ఏపీలో ఈరోజు నుంచి కులగుణన ప్రారంభం కానుంది. ఈ సర్వే ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. మొదట గత ఏడాది నవంబరు 27 నుంచి చేపట్టాలని నిర్ణయించి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం కోసం వాయిదా వేయగా.. ఆ తర్వాత డిసెంబరు 10 నుంచి నిర్వహించాలని నిర్ణయించినా చేపట్టలేదు. ఇక ఈరోజు నుంచి సర్వే ప్రారంభించాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు వెళ్లాయి.

ఇప్పటికే ఏపీలో 6 జిల్లాల పరిధిలోని 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింది కులగణన విజయవంతంగా నిర్వహించారు. ఇక ఈరోజు నుంచి నిర్వహించనున్న సర్వేలో ప్రతి సచివాలయం పరిధిలోని ఇళ్లకు వాలంటీర్లు వెళ్లి ప్రతి ఒక్కరి వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియ 10 రోజుల పాటు అంటే ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ఎవరైనా వివరాలు నమోదు చేయకపోతే.. ఆ తర్వాత కూడా అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ఆన్‌లైన్‌లో వివరాలు సేకరించాల్సి ఉండగా.. మారుమూల పల్లెల్లో సిగ్నల్ లేని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news