వివేకా హత్యకేసులో వైకాపా – టీడీపీ నేతల విచారణ స్టార్ట్… లిస్ట్ ఇదే!!

-

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ తన విచారణను వేగవంతం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసు విచారణకు సంబందించి ఇప్పటికే వివేకా భార్య, మాజీ పీఎస్, వంట మనిషి మొదలైనవారిని విచారించిన అధికారులు… తాజాగా వైకాపా నేతలను కూడా విచారించడం స్టార్ట్ చేసింది. అదే క్రమంలో వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా విచారించనున్నారు!!

వైఎస్ వివేకా హత్యకేసులో వైసీపీ నేతలను విచారించడం మొదలుపెట్టింది సీబీఐ. ఇందులో భాగంగా పులివెందుల వైసీపి నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డిని బుధవారం ఉదయం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సీబీఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఇదే క్రమంలో… శంకర్ రెడ్డి విచారణ అనంతరం.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులను కొందరిని విచారించనున్నట్లు సమాచారం. వీరి విచారణ అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలను సీబీఐ బృందం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో… వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్యను ఇప్పటికే సీబీఐ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. ఈ విచారణకు మాజీ మంత్రి వైఎస్‌ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత కూడా హాజరయ్యారు. ఉదయం 10 నుంచి దాదాపు ఆరుగంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది! వీరి వేగం చూస్తుంటే… వీలైనంత త్వరగానే ఈ కేసు విచారణ పూర్తిచేసే యోచనలో సీబీఐ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version