ఏం తప్పు చేశారో చెప్పకుండా చంద్రబాబును అరెస్ట్ ఎలా చేస్తారు?: న్యాయవాదులు

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో నంద్యాలలో ఉద్రిక్తత చెలరేగింది. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు అన్నారు. ఆయన ఏం తప్పుచేశారో నోటీసుల్లో లేదని తెలిపారు. ఏం తప్పు చేశారో చెప్పకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏసీబీ కోర్టులో కేసు నమోదైందని పోలీసులు చెప్పారు. చంద్రబాబు తరఫున పోలీసులతో న్యాయవాదులు వాదిస్తున్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను చంద్రబాబు ప్రాథమిక ఆధారాలు చూపాలని అడిగారు. 51 నోటీసులు ఇస్తే రిమాండ్ రిపోర్టు ఎలా అడుగుతారని పోలీసులు ఎదురు ప్రశ్న వేశారు. అరెస్టుకు సహకరించాలని చంద్రబాబును కోరారు. హైకోర్టు ఆదేశాలు తమ వద్ద ఉన్నాయని డీఐజీ చెప్పారు. కోర్టు ముందు పెట్టాకా ఆధారాలు లేకపోతే కోర్టే తిరస్కరిస్తుందని.. కోర్టులో తిరస్కరించటం అనేది ట్రెండే కదా అన్నారు. న్యాయవాదులపై తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని.. కొన్ని వేల పేపర్లు తమ వద్ద ఉన్నాయి.. పీఎస్‌కు వెళ్లగానే ఇస్తామని పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version