BREAKING : చంద్రబాబుకు బిగ్‌ షాక్‌..స్కిల్ కేసులో బెయిల్ పై విచారణ వాయిదా

-

BREAKING : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్‌ షాక్‌ తగిలింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ వాయిదా పడింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లాయర్లు సమయం కోరడంతోనే కోర్టు వాయిదా వేసింది. ఈ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టు. దీంతో చంద్రబాబు నాయుడుకు బిగ్‌ షాక్‌ తగిలింది.

Big shock for Chandrababu in AP High Court
Big shock for Chandrababu in AP High Court

మరోవైపు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదుచేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్​ను దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు విననుంది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌రోహత్గీ ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news