చంద్రబాబు బెయిల్ పిటిషన్​పై నేడు విచారణ

-

స్కిల్‌ డెవలప్​మెంట్ సంస్థ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రిమాండ్​లో ఉన్నారు. రిమాండ్ గడువు, రెండు రోజుల సీఐడీ కస్టడీ ఆదివారం ముగియడంతో రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచారు. ఈ సందర్భంగా బాబు రిమాండ్​ను వచ్చే నెల 5వ తేదీ వరకు పొడిగించారు.

Family meeting with Chandrababu

మరోవైపు ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగే అవకాశం ఉంది. రిమాండ్‌ను అక్టోబర్‌ 5 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు న్యాయాధికారి.. బెయిల్‌ పిటిషన్‌ నేడు విచారణకు వస్తుందని తెలిపారు. మరో రెండు కేసుల్లో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఫైబర్‌గ్రిడ్‌ కేసుల్లో పీటీ వారెంట్‌ పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం ఉంది.

కోర్టు ముందు హాజరు పరిచిన తర్వాత చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. థర్డ్‌డిగ్రీ ప్రయోగించి ఏమైనా ఇబ్బంది పెట్టారా అని అడిగారు. వైద్యపరీక్షలు నిర్వహించారా.. కోర్టు ఆదేశాల మేరకు సౌకర్యాలు కల్పించారా? అని ఆరా తీశారు. భౌతికంగా ఏమీ ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు బదులిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news