శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం.. పోటెత్తిన భక్తజనం

-

కలియుగ దైవం.. భక్తుల కొంగు బంగారం.. ఏడుకొండల వాడైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామి వారి రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు. మహారథంపై మాడవీధుల్లో మలయప్పస్వామి విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు.

స్వామి వారి రథోత్సవంతో పాటు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనసేవ నిర్వహించనున్నారు. ఈ సేవ ద్వారా స్వామి వారు కృప కటాక్షలను అందించనున్నారని భక్తుల నమ్మకం. స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంటే వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు ఎనలేని ప్రతి. ఈ బ్రహ్మోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో భక్తులు భారీగా శ్రీవారి సన్నిధికి పోటెత్తుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు రథోత్సవం తిరుమాఢ వీధుల్లో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారి నామస్మరణతో.. గోవిందా గోవిందా.. నామాలతో తిరుమాఢ వీధులు మార్మోగుతున్నాయి. ఆ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news