అనకాపల్లి ఘటన పై హోంమంత్రికి చంద్రబాబు ఫోన్

-

ఆంధ్రప్రదేశ్ లోని అకనాపల్లి జిల్లాలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బాణ సంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని.. ఎనిమిది మంది కార్మికులు మరణించడం పై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన పై వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ హెంమంత్రి అనితతో ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలందించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. 

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు..? వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది..? అనే విషయాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ ఘటన పై విచారణ చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. బాణా సంచా ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news