ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు బెయిల్ లభించడం ఖాయమని రఘురామకృష్ణ రాజు గారు ఆశాభావం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి వైద్య నివేదికలను అందజేయడంలో జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నారని, పొరుగు రాష్ట్రంలోని జైల్లో ఖైదీగా ఉన్న బాబాయికి రెండు నెలల బెయిల్ లభించగా, చంద్రబాబు నాయుడు గారికి స్టాచ్యూరిటీగా లభించే మూలాఖాత్ లను కూడా జైళ్ల శాఖ డిఐజి రవి కిరణ్ రెడ్డి గారు రద్దు చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
తోటి ఖైదీలు ఇబ్బంది పడకూడదని, చంద్రబాబు నాయుడు గారికున్న సౌకర్యాలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకు రెండు వారాల ఇంట్రీమ్ బెయిల్ లభిస్తుందన్నది తన ప్రగాఢ విశ్వాసమని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ఈ కేసులో ఎప్పుడు తీర్పు వెలువడినా అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి సానుకూలంగానే తీర్పు వెలువడుతుందని అన్నారు. రుషికొండకు గుండు కొట్టి పర్యాటక భవనాల పేరిట ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నివాస సముదాయాన్ని నిర్మించారని తెలిపారు.