సీఎం జగన్ కు… ఎన్నికల అధికారికి చంద్రబాబు ఫిర్యాదు

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఓటరు లిస్ట్ తయారీకి అక్రమాలపై TDP అధినేత చంద్రబాబు నేడు ECకి ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో NTR స్మారక నాణెం విడుదల కార్యక్రమం అనంతరం ఆయన ECI కార్యాలయానికి వెళ్లి ఓటర్ లిస్టులో అక్రమాలపై సాక్షాలను సమర్పించనున్నారు. TDP సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తూ, YCPకి సానుకూలంగా ఉండే ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా జాబితాలో చేరుస్తున్నారని ECకి ఆధారాలను సమర్పించనున్నారు.

కాగా, ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు ఇసుక అక్రమ మైనింగ్ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు టిడిపి పిలుపునిచ్చింది. అక్రమ మైనింగ్ జరుగుతున్న ఇసుక రీచ్ లో డంపింగ్ యార్డుల వద్ద నిరసనలు చేపట్టి మీడియా సమావేశాలు నిర్వహించాలని, ఈ నెల 29న తహశీల్దార్ ఆఫీస్ లు, పిఎస్ లలో ఫిర్యాదు చేయాలని కోరింది. ఈ నెల 30న ఇబ్రహీంపట్నంలోని మైనింగ్ డైరెక్టర్ ప్రధాన కార్యాలయ ముట్టడికి తరలి రావాలని పిలుపునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version