కుప్పంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు

-

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజూ కొనసాగుతోంది. నియోజవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారందరికీ చంద్రబాబు అభివాదం చేశారు. మరోవైపు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద సీఎం చంద్రబాబుకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తారు. వారి నుంచి స్యయంగా వినతులు స్వీకరించిన చంద్రబాబు… సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌, అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తాను ఈ నియోజకవర్గం ఎంచుకున్నానని అన్నారు. చిత్తూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. అనంతరం అక్కడి నుంచి కుప్పం డిగ్రీ కళాశాలకు వెళ్లిన బాబు నియోజకవర్గం అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కాసేపట్లో పీఈఎస్‌ ఆడిటోరియానికి వెళ్లనున్న చంద్రబాబు అక్కడ తెలుగుదేశం నాయకులు, ప్రధాన కార్యకర్తలతో భేటీ అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news