గోదావరి వరదలు భరించాలి కానీ… పైనుంచి వచ్చే నీళ్లను వాడుకోవద్ద అంటూ బనకచర్ల ప్రాజెక్టుపై హాట్ కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జాతీయ జెండా ఎగురవేశారు సీఎం చంద్రబాబు నాయుడు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకలకు హాజరైన చంద్రబాబు…. బనకచర్ల ప్రాజెక్టుపై హాట్ కామెంట్స్ చేశారు.

బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగదని వెల్లడించారు. ఎవరు ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం చెప్పాల్సిన అవసరమే లేదని వివరించారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని తాము వినియోగిస్తామని గుర్తు చేశారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలను భరిస్తున్నామని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం ఏంటని ఆ వరదను భరించాలి కాని ఆ నీటిని వాడుకోవద్దని నిలదీశారు చంద్రబాబు నాయుడు. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.