భారత్ బయోటెక్ ఎండీకి ఏపీలో కీలక పదవి !

-

భారత్ బయోటెక్ ఎండీకి ఏపీలో కీలక పదవి దక్కింది. భారత్ బయోటెక్ ఎండీ, పద్మ భూషణ్ సుచిత్ర ఎల్లా ను సలహాదారుగా నియమిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని చేనేత, హస్తకళల అభివృద్ధికి సంబంధించి గౌరవ సలహాదారుగా సుచిత్రా ఎల్లాను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

Chandrababu Naidu government has issued orders appointing Bharat Biotech MD and Padma Bhushan Suchitra Ella as an advisorChandrababu Naidu government has issued orders appointing Bharat Biotech MD and Padma Bhushan Suchitra Ella as an advisor

కేబినెట్ ర్యాంకుతో రెండేళ్ల కాలానికి ఆమెను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చేనేత, హస్తకళల అభివృద్ధికి సంబంధించి, విధానాల రూపకల్పనపై , వివిధ పథకాల రూపకల్పనపై , సాంకేతికత జోడింపు, పర్యావరణ అనుకూల విధానాల అమలుపై సలహాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీఎస్ విజయానంద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version