నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. మూడు రోజులపాటు సొంత నియోజకవర్గంలోనే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు. సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్…చేశారు. ‘ స్వర్ణ కుప్పం ‘ పథకం పేరిట కుప్పం రూపురేఖలు మరింతగా మార్చనున్నారు చంద్రబాబు నాయుడు. వచ్చే ఐదేళ్ల పాటు కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ‘ స్వర్ణ కుప్పం – విజన్ 2029 ‘ పథకం కొనసాగనుంది.
రేపటి పర్యటనలో స్వర్ణకుప్పం విజన్ 2029 ను ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు. కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే 17 అంశాలకు సంబంధించి 92 కోట్ల అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది కడ అధికారుల బృందం. కుప్పం నియోజకవర్గ0లో సుమారు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
రూ.1000 కోట్లతో కుప్పం నియోజకవర్గ పరిధిలోని 50 వేలకు పైచిలుకు ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించనున్నారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే స్వర్ణ కుప్పం ప్రధాన లక్ష్యం అని చెబుతున్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల, కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి పథకం ప్రధాన ఉద్దేశ్యమని…. కుప్పం ప్రాంతంలో సుమారు మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేశారట చంద్రబాబు. పాడి పరిశ్రమ అభివృద్ధికి కుప్ఫంకు మరో రెండు కొత్త డైరీలు ఏర్పాటు చేయనున్నారట.