డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు ఘోర అవమానం ఎదురైంది. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క కనిపించలేదు. గీసుకొండ మండలం మొగుళ్లపల్లి దగ్గర 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన కోసం వచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం పర్యటనలో ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి కనిపించలేదు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం తప్పితే.. ప్రజల కోసం ఏం చేస్తారో చెప్పకుండానే ప్రసంగం ముగించుకుని వెళ్లిపోయారు భట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే ప్రజలు కూడా వెళ్లిపోయారట.. అటు సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో కనిపించని జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క
గీసుకొండ మండలం మొగుళ్లపల్లి దగ్గర 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన కోసం వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం పర్యటనలో కనిపించని ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్,… https://t.co/9HVyhgQ1e7 pic.twitter.com/vqBfEAKqdd
— Telugu Scribe (@TeluguScribe) January 5, 2025