ఏపీ ప్రజలకు అలర్ట్… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుంది. నేటి నుంచి పెన్షన్ల తనిఖీలు చేస్తున్న తరుణంలోనే… అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు వచ్చాయి. అనర్హులు పొందుతున్న పెన్షన్లను తనిఖీ చేయనున్నారు అధికారులు. మంచానికే పరిమితమై రూ.15వేల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ల ఇళ్లకు వెళ్లి వైద్య బృందాలు పరీక్షలు చేస్తాయి.
నెలకు రూ.6వేలు తీసుకుంటున్న దివ్యాంగులకు దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేస్తారు. పెన్షన్ దారులు హాజరుకాకపోయినా, బృందం ఇంటికి వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోయినా వాళ్ల పెన్షన్ హోల్డ్ లో పెడతారు.
దానిలో భాగంగానే పలనాడు జిల్లాలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు సోమవారం నుంచి పెన్షన్ల వెరిఫికేషన్ కొరకు డాక్టర్లతో కూడిన టీమ్లను ఏర్పాటు చేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బాలు నాయక్ , జిల్లా వైద్య శాఖాధికారి రవి మరియు జిల్లా కో ఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ రంగారావుల అధ్వర్యంలో ఐదు టీమ్ లుగా డాక్టర్లను అన్ని మండలాలకు వెరిఫికేషన్ చేయటకు కేటాయించారు.