సింహాచలం ఘటనపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ కు ఆదేశించారు. దింతో నేడు సింహాచలానికి రానున్నారు కమిటీ సభ్యులు. ఈ ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది త్రిసభ్య కమిటీ. రిటైనింగ్ వాల్ వద్దని గతంలో వైదిక సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కాంక్రీట్ బదులు సిమెంట్ ఇటుకలతో 12 అడుగుల గోడ నిర్మాణం చేపట్టారు కాంట్రాక్టర్.
నాసిరకం నిర్మాణం వల్లే ప్రమాదం జరిగిందని విమర్శలు వస్తున్నాయి.
కాగా, సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం ప్రమాద ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. దీనిపై మంత్రులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.