తెలంగాణలో 10వ తరగతిలో 90 శాతం మంది పాసైతే..ఏపీలో 67 శాతమా ? : చంద్రబాబు

-

తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో 90 శాతం మంది విద్యార్థులు పాసైతే.. ఏపీలో కేవలం 67 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారని ప్రశ్నించారు చంద్రబాబు. తాజాగా చంద్రబాబు సమక్షంలో పలువురు బీసీ నేతలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు నా తరువాత జగన్ లాంటి వాడు సీఎంగా వచ్చి ఉంటే హైదరాబాద్ ఏమయ్యేదో..? అని నిలదీశారు.

తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లు మనకు అమరావతి ఉండాలని భావించానని.. 2019 లో టీడీపీ ఓటమి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టమన్నారు. ఇప్పుడు ఏపీలో అన్నీ కూల్చేస్తూ.. ప్రాజెక్టులు ఆపేస్తున్నారని.. హైటెక్ సిటీ, ఐఎస్బీ లాంటి వాటిని కూల్చేసి, ఎయిర్ పోర్ట్, రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులను అపేసి ఉండేవారేమో..? అని ఫైర్‌ అయ్యారు.

నా మీద కక్షతో రాజధాని అమరావతిని స్మశానం చెయ్యాలని చూస్తున్న జగనుకు అవకాశం వచ్చి ఉంటే.. హైదరాబాదును నాశనం చేసేవారని.. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా, ఉపాధి కేంద్రంగా, అభివృద్దికి చిరునామాగా మారిందని పేర్కొన్నారు. ఉడతల కారణంగా కరెంట్ తీగలు తెగిపోవడమేంటీ..? ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము ఉద్యోగుల అకౌంట్లనుంచి మాయం అవడం ఈ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version