తుఫాను బాధితులకు భోజనం సరిగా పెట్టలేరా? – చంద్రబాబు సీరియస్‌

-

తుఫాను బాధితులకు భోజనం సరిగా పెట్టలేరా? అని చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. తుఫాను సహయక చర్యలు చేపట్టాలని నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బాధిత గ్రామాల ప్రజలతో నేరుగా ఫోన్లో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు…తుఫాను సహయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

chandrababu on cyclone effect

అవసరమైన చోట టీడీపీ నేతలు ఆదుకుంటారన్న చంద్రబాబు….తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని సూచనలు చేశారు. పంట ఖర్చులు పెరిగాయి….పెరిగిన సాగు ఖర్చులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేడు పరిహారం అందించాలని కోరారు చంద్రబాబు. హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో పరిహారం పెంచి సాయం చేశామని గుర్తు చేశారు.

హుదూద్, తిత్లీ నాటి కంటే ఎక్కువగా సాగు ఖర్చులు పెరిగాయి…పరిహరం కోసం ప్రత్యేక జీవోలు తేవాలని డిమాండ్‌ చేశారు. ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందోననే విషయాన్ని టీడీపీ నేతలు అధికారులకు సమాచారం అందించాలి…తుఫాను బాధితులకు భోజనం సరిగా పెట్టలేరా ? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version