స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు చంద్రబాబు రిమాండ్ చివరితేదీ కావడంతో.. తాజాగా రిమాండ్ ను పొడిగించింది కోర్టు. మొదటి సారి సెప్టెంబర్ 09న పొడగించగా. 14 రోజుల తరువాత రెండో సారి, మూడో సారి ఇవాళ ఈనెల 19 వరకు రిమాండ్ ను పొడగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈనెల 19 వరకు జ్యూడిషియల్ రిమాండ్ పొడగిస్తున్నట్టు చంద్రబాబుకు ఏసీబీ జడ్జీ చెప్పారు. మరోవైపు రేపు ఇరు పక్షాల వాదనలు వింటామన్న ఏసీబీ కోర్టు చెప్పింది. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు రేపటికి వాయిదా పడ్డాయి.చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబె వాదనలు వినిపించారు. సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ ని పొడగించాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. అందుకే ఈనెల 19 వరకు జ్యుడిషియల్ వాదనలు వినిపించనున్నట్టు సమాచారం.