ఏపీలో వాలంటీర్లకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్..

-

ఏపీలో వాలంటీర్లకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్.. 2023 ఆగస్టు నుండి వలంటీర్ల ఉద్యోగాల్ని జగన్ రెన్యువల్ చెయ్యలేదని…వలంటీర్లను విధుల నుండి మేం తొలగించలేదని ప్రకటించారు ఏపీ మంత్రి బాల వీరాంజనేయస్వామి. జగన్ చేసిన పాపం వలనే వలంటీర్లకి జీతాలు రావడం లేదని… వలంటీర్ల ఉద్యోగాలు మేం రెన్యువల్ చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి బాల వీరాంజనేయస్వామి.

Chandrababu Sarkar good news for volunteers in AP

విజయవాడలో అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దదిగా ఉందని ఫిర్యాదులు వచ్చాయని… అర్థరాత్రి అంబేద్కర్ అభిమానులు జగన్ పేరు తొలగించారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి ఏమీ కాలేదని… జగన్ పేరు తొలగించడంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు మంత్రి బాల వీరాంజనేయస్వామి. అంబేద్కర్ విదేశీ విద్యకి జగన్ ఆయన పెట్టుకున్నాడు… జగన్ పేరుతో ఉన్న బ్యాగులు కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యార్థులకు పంపిణీ చేశామని గుర్తు చేశారు.
జగన్ ప్రభుత్వంలో ఎస్సీ కార్పోరేషన్ ని నిర్వీర్యం చేశారని… దళితుల్ని, గిరిజనుల్ని గత ప్రభుత్వంలో మోసం చేశారని ఆగ్రహించారు మంత్రి బాల వీరాంజనేయస్వామి.

Read more RELATED
Recommended to you

Exit mobile version