చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.. ఎన్టీఆర్ నేను కలిసి విగ్రహాలు పెట్టించాం – కొడాలి నాని

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్, కొడాలి నాని పై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో తనదైన స్టైల్ లో చంద్రబాబు కి కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని. నిమ్మకూరు ఎన్టీఆర్ పుట్టిన ఊరు అని, చంద్రబాబుకు అత్తగారి ఊరు అని చెప్పుకొచ్చారని, పెళ్లయిన 42 సంవత్సరాల తర్వాత మొదటిసారి అత్తారింటికి వెళ్లి పడుకున్నానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని.

ఆయన బస్సులో పడుకున్నాడని, ఎన్టీఆర్ సొంత ఊర్లో కనీసం పడుకోవడానికి ఒక ఇల్లు కూడా ఎవరూ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు కూడా చంద్రబాబు పెట్టించలేదన్నారు. తాము పెట్టిన విగ్రహాలకు చంద్రబాబు దండలు వేశారని అన్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను తాను, జూనియర్ ఎన్టీఆర్ 60 లక్షలు ఖర్చుపెట్టి 2003లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తామిద్దరం అక్కడ భూమిని కొనుగోలు చేసి విగ్రహాలు పెట్టించినట్లు చెప్పారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చెప్పే మాటలను గుడివాడ నియోజకవర్గ ప్రజలు నమ్మబోరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version