నన్ను జైళ్లో పెట్టిన భయం జగన్‌ ను వెంటాడుతోంది – చంద్రబాబు

-

 

దేశంలో అప్పుల పాలైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని సీరియస్‌ అయ్యారు చంద్రబాబు. తెనాలిలో మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో మన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది…ప్రతిపక్ష నాయకులు రైతుల కోసం రాకపోతే, ఈ ముఖ్యమంత్రి కి కదలిక వచ్చేది కాదన్నారు.

సీఎం జగన్… తుఫాను వచ్చిన ప్రాంతంలో పర్యటించకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడని ఆగ్రహించారు. నాలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించిన భయం సీఎం జగన్‌ ను వెంటాడుతుందని ఆగ్రహించారు. చేయని తప్పుకు జైల్లో పెట్టారు, నేను ఎంత క్షోభ పడ్డానో ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని వివరించారు. అహంకారంతో విర్రవీగితే ఏం జరుగుతుందో మూడు నెలల తర్వాత తెలుస్తుందని హెచ్చరించారు. ప్రజల తరఫున పోరాడితే, నాయకులను జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు. కరువు దెబ్బకు సగం పంటలు వేయలేదు, ఇప్పుడు వేసిన పంట తుఫాను కు నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version