అప్పటివరకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం

-

మొన్నటిదాకా టమాట ధరలు సామాన్యులను ఠారెత్తించాయి. ఇక ఇప్పుడు ఉల్లి వంతు నడుస్తోంది. గత మూడు నెలల క్రితం రూ.20 గరిష్ఠ ధర ఉన్న ఉల్లి ఇప్పుడు ఏకంగా రూ.50కి పాకింది. దేశంలో ఉల్లి ధరలు మండిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ధరలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఉల్లి ఎగుమతులపై కేంద్ర సర్కార్ నిషేధం విధించింది.

భారత్​లో ఉల్లిని అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇవాళ్టి నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. ఇందులో కొన్ని మినహాయింపులు కల్పిస్తూ.. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఓడల్లో లోడ్‌ అయిన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడ్‌ను ఎగుమతి చేసుకోవచ్చని డీజీఎఫ్​టీ వెల్లడించింది. ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని కేంద్ర సర్కార్ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version