నవంబర్ 7 తర్వాతే చంద్రబాబు బయటకు వస్తారన్నారు రఘురామకృష్ణ రాజు. చంద్రబాబు నాయుడు గారిపై అక్రమంగా నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పిటిషన్ పై తీర్పును నవంబర్ ఏడవ తేదీలోగా వెల్లడిస్తామని న్యాయమూర్తులు చెప్పడం శుభసూచకమని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేశారని వెల్లడించారు.
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి గారి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని విచారించమని ఆదేశిస్తే, విచారించుకుంటామని పేర్కొనగా, చంద్రబాబు నాయుడు గారి తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా గారు జోక్యం చేసుకొని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారిని విచారించడం అంటే ఆయన్ని అరెస్టు చేయడమేనని అన్నారని, ఫైబర్ గ్రిడ్ కేసులో 8వ తేదీకి వాయిదా వేయడం అంటే అప్పటి వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లేనని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.