టీటీడీ ఈవో, జేఈవో గౌతమీ పై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇది పద్ధతి కాదు, పద్ధతి ప్రకారం పని చేసేది నేర్చుకోండి. మీరు సమాధానం చెప్పండి. ఈ కేంద్రం వద్ద ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు అని ప్రశ్నించారు. అలాగే ప్రతి ఒక్కరికి చెప్తున్నా.. పద్ధతి ప్రకారం నడుచుకోండి. తమాషాలనుకోవద్దు. బాధ్యతలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నో ఎక్స్క్యూజ్. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి.. ఎందుకు జరిగిందో చెప్పండి అని ప్రశ్నించారు.
అలాగే భక్తులను ఉంచేందుకు కొత్త ప్లేస్ ఎంపిక చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇక్కడ నియమించిన పోలీస్ ఆఫీసర్ కి జాగ్రత్తలు చెప్పారా.. ఆ గేటు తీస్తే తొక్కిసలాట జరుగుతుందని ఎందుకు ఊహించలేదు అని కలెక్టర్ తో అన్నారు చంద్రబాబు. ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చింది. టోకెన్లు ఆఫ్లైన్ లో ఎన్ని ఇచ్చారు ఆన్లైన్ లో ఎన్ని ఇచ్చారు. గత విధానం కొనసాగించకుండా కొత్త విధానం ఎంపిక చేసుకుని ఉండాల్సింది.. అలా చేస్తారనే మిమ్మల్ని పంపించాను అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు.