తిరుమలకు వచ్చే వీఐపీలకు చంద్రబాబు బిగ్‌ షాక్‌..ఇకపై రద్దు !

-

తిరుమలకు వచ్చే వీఐపీలకు చంద్రబాబు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలని ఆదేశించారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. సింపుల్ గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి….ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని కోరారు చంద్రబాబు. టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.

Chandrababu’s big shock for VIPs coming to Tirumala

 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలని… కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని పేర్కొన్నారు. ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదు…ఏ విషయంలోనూ రాజీ పడొద్దని.. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోండి…ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని తెలిపారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు చంద్రబాబు సూచనలు చేశారు. అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికతో పనిచేయాలన్న సిఎం చంద్రబాబు…బయోడైవర్సీటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version