తెలంగాణ ఉద్యమ నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నేత నూకల నరేష్‌రెడ్డి మృతి చెందారు. వారం క్రితం గుండెపోటు రావడంతో హైద్రాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన నరేష్‌రెడ్డి… చికిత్స పొందుతూ మృతి చెందారు. నరేష్‌రెడ్డి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెం అన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా నరేష్‌రెడ్డి ఉన్నారు.
ఇక తెలంగాణ ఉద్యమ నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నేత నూకల నరేష్‌రెడ్డి మృతి పట్లు సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కీలక నేత నూకల నరేష్ రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి…నూకల నరేష్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి, వరంగల్ ప్రజలకి తీరని లోటు లోటు అన్నారు. నూకల నరేష్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.