మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి..బాలయ్యకు చంద్రబాబు బర్త్ డే విషేష్

-

నేడు హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్‌ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో.. నందమూరి ఫ్యాన్స్‌ సంబరాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. నారా చంద్రబాబు నాయుడు.. నందమూరి బాలకృష్ణ కు పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలిపారు.

తెలుగు సినీ కథానాయకులు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, హిందూపురం నియోజకవర్గ శాసనసభ్యులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు చంద్రబాబు నాయుడు.

కళాసేవ, ప్రజాసేవ, సామాజిక సేవా కార్యక్రమాలతో అశేష అభిమానుల ఆదరణ చూరగొంటున్న మీరు చేపట్టే ప్రతి కార్యక్రమము విజయవంతం కావాలని… ఎనలేని కీర్తి సంపదలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు బాలయ్యతో దిగిన పిక్‌ ను షేర్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version