ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కురిచి మడతపెట్టి డైలాగ్ ఫుల్ ఫేమస్ అవుతోంది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ వాడుకొని అధికార ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. జగన్ షర్టు మలిస్తే మేము కుర్చీ మడత పెడతామని టిడిపి కౌంటర్ ఇవ్వడంతో.. ఈ డైలాగ్ ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కుర్చీ మడత పెడతామన్న టిడిపి నేతలు వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ లాంటి అద్దే కుర్చీని తెచ్చుకొని మడతపెట్టినంత మాత్రాన సీఎం జగన్ నీ ఎవరు భయపెట్టలేరని పేర్కొన్నారు. 2019లోనే జనం టిడిపి అధినేత చంద్రబాబు కుర్చీ మడత పెట్టారని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. 2024 లో కూడా కుర్చీని ఎక్కడ మడత పెట్టాలో జనం అక్కడే పెడతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్ని విమర్శలు చేసినా జగన్ పై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టలేరని పేర్కొన్నారు. 2024లో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని జగన్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.